Wednesday, January 22, 2025

సిపిఐ బహిరంగ సభను విజయవంతంపై కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : లక్ష గొంతుకల రణ నినాదంతో నిర్వహించిన ప్రజాగర్జన అంచనాలకు మించి విజయవంతం కావడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు స్థానిక తాటిపల్లి రెసిడెన్సిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున జనం తరలిరావడం తమ పార్టీ పట్ల వారికున్న అచంచల విశ్వాసాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు.

బిజెపి పార్టీ మతోన్మాద చర్యలను ఎండగడుతూ వామపక్షాలు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమని, రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న ఆ పార్టీ సిద్ధాంతాలను దేశం యావత్తు వ్యతిరేకిస్తుందని ఇందులో సిపిఐ తన పాత్రను గణనీయంగా పోషిస్తుందని వివరించారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ దేశ ప్రజలు అభద్రతా భావంలోకి వెళ్లేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. అన్ని వర్గాలకు బిజెపి వ్యతిరేకమని ఈ సారి ఎన్నికల్లో ప్రజలు చైతన్య వంతులై ఆ పార్టీని భూ స్థాపితం చేస్తారని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ దేశ స్థాయిలో చేస్తున్న పోరాటానికి అన్ని పార్టీల మద్దతు అవసరమని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. మోడీతో సహవాసం దృతరాష్ట్ర కౌగిలి వంటిదని హెచ్చరించారు. భవిష్యత్తులోనూ తాము ఇదే విధంగా పోరాటాలు చేస్తామని దేశం, రాష్ట్రంలో సుపరిపాలన ధ్యేయంగా, బిజెపి పార్టీని అంతమొందించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. తాము కేవలం ఆ పార్టీ విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు.

ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌కె. సాబీర్‌పాషా, సీనియర్ నాయకులు బందెల నర్సయ్య, గుత్తుల సత్యనారాయణ, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, వీరస్వామి, వంగా వెంకట్,వై.శ్రీనివాస్‌రెడ్డి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్‌రావు, రమణమూర్తి,ఉప్పుశెట్టి రాహుల్, నేరెళ్ళ శ్రీనివాస్, సత్యనారాయణ చారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News