- Advertisement -
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యాశాఖలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించడం పట్ల విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం శాసనసభలో సిఎం కెసిఆర్‌ను కలిసి మంత్రి పుష్ఫగుచ్చం అందజేశారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నియామకాల ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నట్లు సిఎం ప్రకటించడం ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కొత్త పుంతలు తొక్కుతుందని తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 13,086, ఉన్నత విద్యాశాఖలో 7,878 పోస్టులను భర్తీ చేయబోతున్నామని సిఎం ప్రకటించడం అభినందనీయమని అన్నారు.
- Advertisement -