Thursday, January 23, 2025

కెసిఆర్, హరీష్ రావుకు కృతజ్ఞతలు: సాధన సమితి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్ రావుకు ఎంబిబిఎస్ బి కేటగిరి లోకల్ రిజర్వేషన్ సాధన సమితి, విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాధన సమితి, విద్యార్థుల తల్లిదండ్రులు కోకాపేట్ లోని మంత్రి నివాసం వద్ద మంత్రి హరీశ్ రావుకు శాలువా కప్పి సత్కరించారు. మన సీట్లు మనకే దక్కేలా చేసిన సిఎం కెసిఆర్ రుణం తీర్చుకోలేనిదని అంటూ జై తెలంగాణ జై కెసిఆర్ జై హరీశ్ రావు అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంబిబిఎస్ బి కెటగిరి సీట్ల భర్తీలో లోకల్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ గురువారం 29న జిఒ జారీ చేయడాన్ని తెలంగాణ ఎంబిబిఎస్ బి కెటగిరి సీట్ల లోకల్ రిజర్వేషన్ సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసరి రవి ప్రసాద్, ముఖ్య సలహాదారు ఇ. చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సతీష్ లు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సిఎం కెసిఆర్ రుణం తీర్చుకోలేనిదని, విద్యార్థులకు డాక్టర్ అయ్యే గొప్ప అవకాశం లభిస్తుందని చెప్పారు. ఎంతో కాలం నుంచి తెలంగాణ విద్యార్థులకు బి కెటగిరి సీట్లలో అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి జిఒ జారీ చేయడం అభినందించదగిన విషయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News