Wednesday, January 22, 2025

మోడీ, అమిత్ షాలకు ధన్యవాదాలు : రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : పార్టీ సస్పెన్షన్ ఎత్తి వేసినందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా లకు ప్రత్యేక ధన్యవాదాలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఆదివారం బిజెపి అధిష్టానం ఆయన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసినందుకు గాను రాజాసింగ్‌ను ఆగస్ట్ 23, 2022న బిజెపి నాయకత్వం రాజా సింగ్‌ను సస్పెండ్ చేసింది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వాన్ని కోరారు. ఈ విషయమై జాతీయ నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపింది. ఈ మేరకు రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బిజెపి క్రమశిక్షణా సంఘం వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 10న బిజెపి నాయకత్వం పంపిన షోకాజ్ నోటీసుకు రాజా సింగ్ సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో తాను సంతృప్తి చెందానని క్రమశిక్షణా సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్ ఒక ప్రకటనలో తెలిపారు. సస్పెన్షన్ ఎత్తి వేయడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ ఎత్తున ర్యాలీగా ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు.
పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలిస్తున్నారు..
రాష్ట్రంలో పోలీస్ వాహనాల్లో డబ్బులు తరలిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బిఆర్‌ఎస్ వందల కోట్లు ఖర్చు చేసినా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బిజెపికి 80 సీట్లు వస్తాయని, వచ్చే ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News