Wednesday, January 8, 2025

మన సిద్ధాంతమే గెలుస్తుంది

- Advertisement -
- Advertisement -
Thanks to Rahul for praising MK Stalin
స్టాలిన్ ప్రశంసకు రాహుల్ థ్యాంక్స్

న్యూఢిల్లీ: లోక్‌సభలో బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తన ఉత్తేజపూరిత ప్రసంగాన్ని ప్రశంసించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. తాము విశ్వసించే భిన్నత్వంలో ఏకత్వం, సకల సంస్కృతుల, సహకార సిద్ధాంతంతో కూడిన ఫెడరల్ వ్యవస్థదే విజయమని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమిళ ప్రజలు ఎంతో కాలంగా చేస్తున్న వాదనలను వారి తరఫున రాహుల్ వినిపించినందుకు స్టాలిన్ కృతజ్ఞతలు తెలియచేయగా తమిళులతోసహా దేశంలోని ప్రతి రాష్ట్రానికి చెందిన ప్రజలు తన సోదరసోదరీమణులని రాహుల్ పేర్కొన్నారు. లోక్‌సభలో తన ప్రసంగానికి స్పందిస్తూ స్టాలిన్ తెలియచేసిన ప్రశంసావాక్యాలకు రాహుల్ ధన్యవాదాలు తెలియయచేస్తూ గురువారం ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News