Sunday, January 19, 2025

ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు: ఛైర్మన్ సోమనాథ్

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట: పిఎస్‌ఎల్‌వి-సి 56 ప్రయోగం విజయవంతమైంది. పిఎస్‌ఎల్‌వి-సి56 ద్వారా ఎర్త్ ఆర్బిట్‌లోకి ఏడు ఉపగ్రహాలను పంపించనున్నారు. రోదసీలోకి డిఎస్-సార్ ప్రధాన ఉపగ్రహం, ఆరు చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇస్రో మూడో వాణిజ్య ఉపగ్రహం ప్రయోగం చేసింది. సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి.

శాస్తవేత్తలకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. పిఎస్‌ఎల్‌వి- సి56 ద్వారా ఏడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టామని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలన్నారు. వాహన నౌక ఉపగ్రహాలను కచ్చితమైన కక్షలోకి ప్రవేశపెట్టామని, పిఎస్‌ఎల్‌వి శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామని, ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో మరో పిఎస్‌ఎల్‌వి ప్రయోగం చేస్తామని ఇస్రో చైర్మన్ స్పష్టం చేశారు.

రెండు వారాల్లో ఇస్రోకు చెందిన రెండు అతిపెద్ద ప్రయోగాలు జరిగాయని ఇస్రో శాస్త్రవేత్త బిజు పేర్కొన్నారు. అంకితభావం గల ఇస్రో బృందం వల్లే ఇది సాధ్యమైందన్నారు. పిఎస్‌ఎల్‌వి శ్రేణిలో 56వ ప్రయోగం ఇది అని కొనియాడారు. సింగపూర్ బృందం తమకు ఎప్పుడూ మద్దతుగా నిలిచిందని, గతంలో సింగపూర్‌కు చేపట్టిన ప్రయోగ ఫలితాలు అనుభవిస్తున్నామని, పిఎస్‌ఎల్‌వి ద్వారా మరిన్ని అవకాశాలు కల్పిస్తారని నమ్ముతున్నామన్నారు.

Also Read: ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం: హరీష్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News