Thursday, December 26, 2024

సిఎం సభకు తరలి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: పటాన్‌చెరులో సిఎం కెసిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుంటున్న ఆస్పిటల్ విషయం తేలిసిన 3 రోజుల వ్యవధిలోనే సన్నాహలు పూర్తి చేసుకోవడం జరిగిందని , కెసిఆర్ పాల్గొన్న సభకు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు ప్రజలకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.శుక్రవారం సాయంత్రం పటాన్‌చెరు పట్టణంలోని క్యా ంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ప్రజా ప్రతినిధులతో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సిఎం కేసీఆర్ సభలో ఇచ్చిన హామీలపై మంత్రి హరీశ్ రావుతో హైదరాబాదులో ఈ రోజు ఉదయం కలసి చర్చించడం జరిగిందన్నారు. సభా ముఖంగా ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేసేందుకు పూర్తి స్తాయిలే అధికారులతో చర్చించి పనులు అమలు అయ్యే విదంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సిఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీశ్ రావు, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని రానున్న రోజుల్లో అన్ని విదాల అభివృద్ధ్ది చేపట్టనున్నట్టుగా చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మణ్ ప్రభాకర్,ఎంపిపి దేవానంద్,జెట్పీటీసీ సుధాకర్ రెడ్డికార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్పనగేశ్, మున్సిపల్ చైర్మణ్ పాండురంగా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మణ్ విజయ్,నాయకులు ఆదర్శ రెడ్డి,విజయ భాస్కర్ రెడ్డి, బాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News