Thursday, January 23, 2025

ఆయుర్వేదిక్ పేరిట భారీ మోసం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణలో నల్గొండ ప్రాంతానికి చెందిన నర్సిరెడ్డి దంపతులు తన్విత ఆయుర్వేదిక్ నిలయం ప్రొడక్ట్ పేరుతో రూ.16 కోట్ల మేరకు బురిడీ కొట్టి, పరారైన సంఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తన్విత ఆయుర్వేదిక్ నిలయం పేరుతో ఆరు నెలల కిందట అచ్చంపేట ప్రజలకు పరిచయమైన ప్రొడక్ట్‌లో పది రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయని నమ్మబలికి, పట్టణంలో నలుగురు వ్యక్తులను పరిచయం చేసుకుంటూ, ప్రొడక్టుల ద్వారా పదికి రూ.100 ఇస్తూ నమ్మిస్తూ అదే క్రమంలో లక్షలాది రూపాయలు లబ్ధిదారుల నుంచి సుమారుగా రూ.16 కోట్ల మేర మోసం చేసి ఉడాయించారు. మోసపోయిన బాధితుల్లో ఎక్కువగా వ్యాపారులు, టీచరులు, ఫోర్త్ ఎస్టేట్లుగా భావించే రిపోర్టర్లు సైతం ఉన్నారు.

ఇదే తరహాలో రాష్ట్రంలో పలు జిల్లాల్లో సైతం వంద కోట్లు మోసం చేసిన ఘన చరిత్ర నర్సిరెడ్డి దంపతుల చరిత్ర అని లబ్ధిదారుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయమై ఎస్‌ఐ ఎం.రాములును వివరణ కోరగా.. తన్విత ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ ద్వారా ప్రజలకు నమ్మబలికి మోసం చేసిన మాట వాస్తవమేనని, వారి చేతుల్లో మోసపోయిన నలుగురు వ్యక్తులు తమకు శుక్రవారం ఫిర్యాదు చేశారని తెలిపారు. కాగా, ఈ ఘరానా మోసానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకుంటామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News