Sunday, December 22, 2024

తాప్సీకి పెళ్లయిపోయిందా?

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటి తాప్సీ పెళ్లి చేసుకుందా? ఈ ప్రశ్నకు సోషల్ మీడియా అవుననే అంటోంది మరి. తాప్సీ చాలా ఏళ్ళుగా  డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాస్ బోతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ శనివారం వివాహ బంధంతో ఒక్కటయ్యారంటూ వార్తలు వినవస్తున్నాయి. ఉదయ్ పూర్ లో జరిగిన తాప్సీ-మథియాస్ ల పెళ్లికి చాలా తక్కువమంది బంధుమిత్రులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.

కెరీర్ ఆరంభంలో ‘ఝుమ్మంది నాదం’ మూవీతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, మిస్టర్ పర్ ఫెక్ట్, మొగుడు, వస్తాడు నా రాజు, వీర, దరువు, గుండెల్లో గోదారి వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తన అదృష్టాన్ని వెతుక్కుంటూ బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ నటిగా స్థిరపడటమే కాకుండా, అమితాబ్ వంటి అగ్రశ్రేణి తారలతో నటించింది. థప్పడ్, మిషన్ ఇంపాజిబుల్, మిషన్ మంగల్, మన్ మర్జియా వంటి సినిమాలతో తానేంటో నిరూపించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News