Monday, December 23, 2024

ఆ అధికారి అంటేనే ఓ ప్రత్యేకత…

- Advertisement -
- Advertisement -
  •  ఎస్‌ఐ స్థాయి నుంచి ఎస్పి వరకు పదోన్నతి…
  • లా అండ్ అర్డర్ విధి నిర్వహణలోక్రమశిక్షణ
  • ఎస్పిగా పదోన్నతి పొందిన అధికారి కిషన్‌సింగ్

చేగుంట: ఆ అధికారి అంటేనే ఓ ప్రత్యేకత కలిగి ఎస్‌ఐ నుంచి ఎస్పిగా పదోన్నతి పొందిన ధీరావత్ కిషన్‌సింగ్ లా అండ్ ఆర్డర్‌లో క్రమశక్షణ గల ఉద్యోగం చేస్తూ ఎన్ని అవరోధాలు వచ్చిన ముందుకు వెళ్లుతూ సమైక్యా రాష్ట్రంలో నక్సలిజంపై తనదైన ముద్ర వేసుకుని ప్రజలకు మంచి చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులను గుర్తించి వారికి సరైన గౌరవం కిషన్‌సింగ్‌కు దక్కింది. నల్గోండ జిల్లాలో 1989లో ఎస్‌ఐగా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి లాంగ్ ఆర్డర్‌లో క్రమశిక్షణ బాధ్యతగల విధులు నిర్వహించేవారు. చేగుంట ఎస్‌ఐగా మూడు (3) సార్లు విధులు నిర్వహించారు.

ఆయన ఎస్‌ఐగా ఉన్న సమయంలో పోలీసులు బయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ల వలసి ఉండేది, చేగుంట మండలంలో అప్పట్లో ఇబ్రహీంపూర్ సర్పంచ్ తమ్మల లింగం, మక్కరాజిపేట సర్పంచ్ లాలాగౌడ్ నక్సలైట్లు కాల్చి చంపారు. ఆ సమయంలో బాధ్యతలు చేపట్టిన కిషన్‌సింగ్ లా అండ్ అర్డర్ ను అదుపులో పెట్టే క్రమంలో చేగుంట మండలంలో మూడు ఎన్‌కౌంటర్‌లు చేశారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ అవగాహన సదస్సులు పెట్టి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. చేగుంటలో 3 సార్లు ఎస్‌ఐ గా, మెదక్ టౌన్, బిక్కనూర్, సిద్దిపేట టౌన్ ఎస్‌ఐగా, సిద్దిపేట రూరల్ సిఐ , మహబూబ్‌నగర్ సిఐగా, ఎఎస్‌పిగా పదోన్నతి పొంది అదిలాబాద్‌లో విధులు నిర్వహించారు.

హైదరాబాద్ అంబర్‌పేటలోని పోలీస్ అకాడమిలో పోలీసులకు శిక్షణ ఇచ్చారు. అయన ట్రేనింగ్‌లో ఎంతో మంది పోలీసులు శిక్షణ పొందారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రాష్ట్రంలో 18 మందికి ఎస్పిలుగా పదోన్నతి కల్పించిన వారిలో కిషన్‌సింగ్ ఉండడం కిషన్ సింగ్‌కు ఉమ్మడి మెదక్ జిల్లాతో ఎంతో బాంధవ్యం ఉంది ఇక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రమోషన్ వచ్చిన ధీరావత్ కిషన్‌సింగ్ మెదక్ ఎస్పిగా రావాలని అనుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News