Friday, January 17, 2025

అది అక్రమార్కుల గ్రూప్ ఫొటో

- Advertisement -
- Advertisement -

భోపాల్: బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల సమావేశంపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అది అక్రమార్కుల గ్రూపు ఫొటో అని ఎద్దేవా చేశారు. ఆ స మావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ కొన్నిల క్షల కోట్ల రూపాయల విలువైన కుంభకోణాలకు పాల్పడ్డాయని దుయ్యబట్టారు. భోపాల్‌లో మంగళవారం నిర్వహించిన ‘ మేరా బూత్ సబ్‌సే మజ్‌బూత్’ కార్యక్రమంలో భాగంగా బిజెపి శ్రేణులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘ఈ మధ్య కాలంలో ‘హామీ’అనే పదాన్ని పదేపదే వింటున్నాం. ఈ పార్టీలన్నీ( విపక్షాలు) అవినీతి, కోట్ల రూపాయల కుంభకోణాలకు హామీలిచ్చినవే. కొన్ని రో జుల క్రితం వారంతా ఓ ఫొటో సెషన్ నిర్వహించారు. ఆ ఫొ టోలో ఉన్న వాళ్లంతా రూ.20 లక్షలకోట్ల విలువైన కుంభకోణాలకు హామీలిచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఒక్కటే లక్షల కో ట్ల విలువైన కుంభకోణాలకు పాల్పడింది.

ఈ పార్టీలనిటికీ స్కామ్‌లు చేసిన అనుభవం మాత్రమే ఉంది. వారంతా ఇచ్చే హామీ ఒక్కటే .. కుంభకోణం. ఇలాంటి హామీలను అంగీకరించాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది దేశ ప్రజలే. ఇక మోడీ హామీ ఏమిటంటే ప్రతి అవినీతిపరుడిపైనా చర్య తప్పదు’ అని ప్రధాని విపక్షాలపై మండిపడ్డారు. ఇక వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని ఓడించడానికి ఉమ్మడి పోరుకు దిగాలన్న ప్రతిపక్షాల తీర్మానంపైనా మోడీ విమర్శలు గుప్పించారు. ‘ ఇప్పటివరకు ఒకరినొకరు దూషించుకున్న వ్యక్తులు ఇప్పడు ఒకరి కాళ్లపై మరొకరు పడుతున్నారు. అది వాళ్ల నిస్సహాయతకు నిదర్శనం. అలాంటాటి వారిపై కోపం వద్దు జాలి మాత్రమే చూపించాలి’ అని పార్టీ కార్యకర్తలతో ప్రధాని అన్నారు. మరోసారి ఉమ్మడి పౌరస్మృతిని తెరమీదికి తెచ్చారు. ఒకే దేశంలో రెండు చట్టాలు ఎలా నడుస్తాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో మనిషికో చట్ట ఉంటే ఆ కుటుంబం ఎలా నడుస్తుందని కూడా ప్రశ్నించారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధాని ట్రిపుల్ తలాక్ గురించి కూడా మాట్లాడారు.

దేశంలో ఎవరి ప్రయోజనం కోసం ఇన్నాళ్లు ట్రిపుట్ తలాక్‌ను కొనసాగించారని ప్రతిపక్షాలనుద్దేశించి ప్రశ్నించారు. ఈజిప్టు, ఇండొనేషియా, ఖతార్. జోర్డాన్, సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి ముస్లిం దేశాల్లో తలాక్ ఆచారాన్ని ఎప్పుడో రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే ట్రిపుల్ తలాక్‌ను కొనసాగించారని ఆయన దుయ్యబట్టారు.తలాక్ రద్దు చట్టం తేవడంతో ముస్లిం మహిళలకు స్వేచ్ఛ లభించిందన్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా బిజెపికి ముస్లిం మహిళలు అండగా నిలుస్తున్నారన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. అలాంటి పార్టీలను దూరంగా ఉంచాలని సూచించారు. యూనిఫామ్ సివిల్ కోడ్( ఉమ్మడి పౌరస్మృతి)ను ఉద్దేశిస్తూ దేశంలోని ప్రజలందరికీ ఒకే చట్టం అవసరాన్ని రాజ్యాంగం కూడా తెలిపిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News