చెన్నై: ఐదుసార్లు ఐపిఎల్ ట్రోఫీ విజేత చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్ కలిసి రావడం లేదు. తొలి మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించండంతో ఈ సీజన్‌లో తిరుగులేని జట్టుగా మారుతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఆ తర్వాత ఒక లక్నోపై తప్ప.. మరే మ్యాచ్‌లోనూ చెన్నై విజయం సాధించలేదు. ఇక శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలై.. ప్లేఆఫ్స్ ఆశలను దాదాపుగా చేజార్చుకుంది. అయితే హైదరాబాద్‌తో ఓటమికి తమ జట్టు సమిష్టిగా విఫలం కావడమే కారణమని కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిప్రాయపడడ్డారు.
మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ బాగుంది. కానీ, మేము ఒక్కొక్కరిగా ఔట్. ఈ పిచ్ మీది 155 చాలా తక్కువ. అసలు వికెట్ ఎక్కువ టర్న్ కాలేదు. 8-10 ఓవర్ల తర్వాత పిచ్ స్వభావం మారింది. పరుగులు రాబట్టేందకు ఆస్కారం ఉన్నా.. అది చేయలేకపోయాం. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు అనుకూలించింది. వాళ్లు మంచిగానే బౌలింగ్ చేశారు. జట్టుకు అవసరమైనప్పుడు వికెట్లు తీశారు. కానీ మేం ఒక 15-20 పరుగులు ఎక్కువ చేసి ఉంటే.. విజయం మాకే దక్కేది’’ అని అన్నాడు.