భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వరంగల్ ఎంపి సీటు బిఆర్ఎస్ లో చిచ్చుపెట్టింది. ఆ టికెట్ ఆశిస్తున్న స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎంఎల్ఏ తాటికొండ రాజయ్య.. పార్టీ స్పందించకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలో పార్టీ అధినేత కెసిఆర్ కు రాజీనామా లేఖ పంపుతానని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల వేళ బిఆర్ఎస్ లో రాజయ్య నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
పార్టీలో తాను అసంతృప్తిగా ఉన్న మాట మాత్రం వాస్తవం అన్నారు. తాను ప్రాధాన్యం వహించిన 2 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ గెలిచిందన్నారు. అయినా తనకు పార్టీలో మాత్రం సరైన గుర్తింపు దక్కటం లేదని వాపోయారు. కార్యకర్తల నుంచి తనకు ఒత్తిడి బాగా పెరిగిపోందన్న రాజయ్య.. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పార్టీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశమే దక్కటం లేదని రాజయ్య తెలిపారు. కాగా రాజయ్య ఈ నెల 10 కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.