Monday, December 23, 2024

బిఆర్ఎస్ లో నాకు గుర్తింపు లేదు: తాటికొండ రాజయ్య

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బిఆర్‌ఎస్‌కు మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎంఎల్ఏ రాజయ్య గుడ్‌బై చెప్పనున్నారు. కాసేపట్లో పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపనున్నారు. ఈ నెల 10 తేదీన రాజయ్య కాంగ్రెస్‌లో చేరనున్న జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాటికొండ రాజయ్య స్పందించారు. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరట్లేదని రాజయ్య తెలిపారు. ఇప్పటికిప్పుడు బిఆర్ఎస్ నుంచి వెళ్లట్లేదని చెప్పారు. బిఆర్ఎస్ లో మానసిక క్షోభకు గురయ్యానని తాటికొండ వెల్లడించారు. బిఆర్ఎస్ లో తనకు గుర్తింపులేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామనడం సమంజసం కాదని సూచించారు. బిఆర్ఎస్ విధివిధానాలు తనకు నచ్చట్లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల నుంచి తనపై ఒత్తిడి ఉందన్నారు. తన అనుచరులతో చర్చించి పార్టీ మార్పపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. నేను 15 ఏళ్లు కాంగ్రెస్ లో ఉన్నానని రాజయ్య తెలిపారు. కాంగ్రెస్ లో ఉండి తెలంగాణ కోసం పోరాడానని చెప్పిన రాజయ్య పరిచయాలు ఉన్నంతమాత్రాన పార్టీ మారాననడం సమంజసం కాదని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News