తట్టేపల్లిలో త్రేతాయుగం నాటి ఆలయంగా ప్రసిద్ధి
నేడు ఆలయానికి స్వామివారు, సోమవారం జాతర
ఎమ్మెల్యే సహకారంతో ఆలయంలో అభివృద్ధి పనులు
జాతరకు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం
జిల్లాలోనే అతి ప్రాచీనమైన దేవాలయంగా తట్టేపల్లి శ్రీ అంబురామేశ్వర ఆలయం ప్రసిద్ధి గాంచింది.
త్రేతాయుగంలో స్వయంగా శ్రీరాముడే శివలింగాన్ని ప్రతిష్టించి.. తట్టేపల్లి నేలపై నడియాడిన ప్రాంతంగా భక్తులు
విశ్వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే.. బంగారు లింగమయ్య స్వామిగా పేరొందిన శ్రీ అంబురామేశ్వరుడి జాతర
ఉత్సవాలు నేటి రాత్రితో స్వామి వారిన పల్లకీలో తీసుకెళ్లడంతో ప్రారంభమవుతుండి. శ్రీరాముడి
సీతాదేవి కోసం నడియాడిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన అంబురామేశ్వరుడి జాతరకు సర్వం సిద్ధం చేశారు. రేపు
(సోమవారం) అతిపెద్ద జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలేత్తకుండా ఉండేందుకు ఆలయ కమిటీ, పెద్దలు, ప్రజాప్రతిధులు, అధికార యాంత్రాంగం పకడ్భందీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
మన తెలంగాణ/పెద్దేముల్: జిల్లాలోనే అతి ప్రాచీనమైన దేవాలయంగా తట్టేపల్లి శ్రీ అంబురామేశ్వర ఆలయం ప్రసిద్ధి గాంచింది. త్రేతాయుగంలో స్వయంగా శ్రీరాముడే శివలింగాన్ని ప్రతిష్టించి.. తట్టేపల్లి నేలపై నడియాడిన ప్రాంతంగా భక్తులు విశ్వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే.. బంగారు లింగమయ్య స్వామిగా పేరొందిన శ్రీ అంబురామేశ్వరుడి జాతర ఉత్సవాలు నేటి రాత్రితో స్వామి వారిన పల్లకీలో తీసుకెళ్లడంతో ప్రారంభమవుతుండి. శ్రీరాముడి సీతాదేవి కోసం నడియాడిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన అంబురామేశ్వరుడి జాతరకు సర్వం సిద్ధం చేశారు. రేపు(సోమవారం) అతిపెద్ద జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలేత్తకుండా ఉండేందుకు ఆలయ కమిటీ, పెద్దలు, ప్రజాప్రతిధులు, అధికార యాంత్రాంగం పకడ్భందీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
త్రేతాయుగం నాటి ఆలయంగా ప్రసిద్ధి: మండలంలోని తట్టేపల్లి-పాషాపూర్ గ్రామాల మద్యగల దట్టమైన అటవీ ప్రాంతంలో శ్రీ అంబురామేశ్వర ఆలయం వెలసింది. త్రేతాయుగంలో శ్రీ రాముడు అటవీ మార్గం కుండా వెళ్తున్నాడు. అయితే చీకటి పడటంతో అటవీ ప్రాంతంలో సేదతీరేందుకు నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీరాముడికి దాహం వేయడంలో అక్కడే తన బాణం(అంబు)తో గంగను పైకి తెచ్చాడు. అంతేకాకుండా ఓ శివలింగాన్ని సైతం ప్రతిష్టించి పూజలు చేసినట్లు భక్తులు విశ్వసిస్తుంటారు. అందువల్లనే అంబురామేశ్వర ఆలయంగా పేరొచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఆలయ పరిసరాల్లోని నందినుంచి జాలువారే జలపాతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే, ఇక్కడ ఐదు ఆకుల పుండికూర ప్రత్యేకతగా చెప్పవచ్చు. భక్తులు పుండికూరను జాతర రోజు, మరుసటి రోజున ఆహరంగా తీసుకుంటారు. ఈ పుండికూరలో సర్వరోగ నివారణ గుణాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. దీంతో ఎంతోమంది భక్తులు పుండికూరను తీసుకెళ్తారు. అలయ పరిసరాల్లో మాత్రమే ఐదు ఆకుల పుండికూర దొరకడం విశేషంగా చెప్పవచ్చు.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి సహకారంతో ఆలయంలో రూ.50లక్షల నిధులతో పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం నిధులు కెటాయించారు. ఈ నిధుల సహాయంతో పై భాగం దారి నుంచి ఆలయానికి సాఫీగా చేరుకోవడానికి రూ.15లక్షలతో పట్టుకోవడానికి వీలుగా ఉండే గ్రిల్స్‌తో మెట్ల నిర్మాణం చేపట్టారు. రూ.9లక్షలతో ఆలయ పరిసరాల్లో ఓ షెడ్డు, ప్రహరీ, కోనేరులోకి ఇబ్బందులు లేకుండా దిగడానికి వీలుగా మెట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మరో 10లక్షలతో ధర్మశాల, స్లాబ్ పనులను చేపట్టారు. అలయానికి వెళ్ళడానికి ముందస్తుగా రూ.16లక్షలతో సీసీ రోడ్డు పనులు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. అంతేకాకుండా స్థానికులు, దాతలు, ప్రజాప్రతిధులు, నాయకుల సహాయ సహకారాలతో అలయాన్ని ప్రతియేటా అభివృద్ధి పరుస్తున్నారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయంలో తగు అభివృద్ధి పనులు చేపడుతూ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
జాతర మహోత్సవ విశేషాలు: శావణమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ అంబురామేశ్వర స్వామి జాతరను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నేటి నుంచి ఆలయ ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పవచ్చు. అదివారం రాత్రి స్వామిని పల్లకీలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్తారు. సోమవారం ఉదయం నుంచి పంచామృతాలతో అభిషేకాలు, రుద్రాభిషేకంతో పాటుగా ఆలయంలో కొలువైన శివ లింగమయ్యకు ధూపదీప నైవేధ్యాలతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. భక్తుల సౌకర్యార్ధం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రేపు(సోమవారం) నిర్వహించనున్న జాతరకు యాలాల, బషీరాబాద్, వికారాబాద్, జహీరాబాద్, కర్నాటలోని షాదీపూర్, కుంచారం, చించోళి, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి అశేష భక్త జనం రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుకు తలేత్తకుండా ఉండేందుకు ఆలయ కమిటీ నిర్వహకులు, అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. కాగా, జాతర ప్రశాంతంగా జరిగేలా ఎస్‌ఐ కాశీనాథ్ ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జాతర ఏర్పాట్లు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. మొత్తానికి అశేష జనవాహిని మద్య శ్రీ అంబురామేశ్వరుడి జాతర జరుగనుంది.