- Advertisement -
బెంగళూర్: కర్నాటక 19వ గవర్నర్‌గా కేంద్ర మాజీమంత్రి థావర్‌చంద్ గెహ్లాట్(73) బాధ్యతలు చేపట్టారు. ఆదివారం గెహ్లాట్‌తో బెంగళూర్‌లోని రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్‌ఓకా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ వాజుభాయ్ దాదాభాయి వాలా, ముఖ్యమంత్రి యడియూరప్ప, మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గవర్నర్ పదవి చేపట్టకముందు కేంద్రంలో సామాజిక న్యాయశాఖమంత్రిగా గెహ్లాట్ పని చేశారు. రాజ్యసభలో బిజెపి పక్ష నేతగా కూడా వ్యవహరించారు.
Thawarchand Gehlot sworn as Governor of Karnataka
- Advertisement -