Saturday, December 21, 2024

అన్ని వార్డుల అభివృద్ధే లక్ష్యం

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపికా నర్సింహరెడ్డి

మేడ్చల్: మంత్రి మల్లారెడ్డి సహకారంతో అన్ని వార్డుల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మేడ్చల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని 9వ వార్డు గిర్మాపూర్‌లో రాగం యాదయ్య ఇంటి నుంచి స్థానిక కూరగాయల మార్కెట్ వరకు సిసి రోడ్డు పనులను వార్డు కౌన్సిలర్ వంగేటి లావణ్య హనుమంత్ రెడ్డితో కలిసి దీపికా నర్సింహారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వార్డులలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఉప సర్పంచ్ నరసింహారెడ్డి, రాజిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News