Thursday, January 23, 2025

నీలగిరిని సుందరవనంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

నల్గోండ:నీలగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నందనవనంగా మార్చడమే లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఐదవ వార్డులో వివిధ అభివృద్ధి ప నులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సహకారంతో పట్టణంలో సిసి రోడ్లు, మురుగు కాలువలు వరద కాలువలు అంతర్గత రహదారులు, పార్కుల అభివృద్ధి కళాభారతి వంటి వి సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని.. తెలిపారు.

గత పాలకుల నిర్లక్ష్యంతో నల్లగొండ పట్టణం ఎంతో వెనుకబడి ఉందన్నారు. కానీ నేడు రాష్ట్ర ఎవరు ఊహించని విధంగా కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. మరో మూడు నెలల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పున్న గణేష్, వట్టిపల్లి శ్రీనివాస్, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News