Monday, December 23, 2024

నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్షం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్షంగా పాలకవర్గం పని చేస్తుందని నగర మేయర్ వై సునీల్‌రావు అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా గురువారం మేయర్, కమీషనర్ సేవా ఇస్లావత్ 38, 57, 10 డివిజన్‌లలో పర్యటించారు.

మూడు డివిజన్లలో సుమారు 47 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నగరంలోని 38వ డివిజన్ శ్రీహరినగర్‌లో స్థానిక కార్పొరేటర్ కచ్చు రవితో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 12 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. అనంతరం 57వ డివిజన్‌లో కార్పొరేటర్ బండ సుమ రమణారెడ్డితో కలిసి నగరపాలక సంస్థకు 11 లక్షల నిధులతో ఎస్‌డబ్లుజీ డైనేజీ పైపులైన్ నిర్మాణం పనులకు భూమి చేసి పనులు ప్రారంభం చేశారు.

అనంతరం 10వ డివిజన్ తిరుమలనగర్‌లో స్థానిక కార్పొరేటర్ కాసర్ల ఆనంద్‌తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 26 లక్షల నిధులతో రెండు చోట్ల సీసీ రోడ్డు, డైనేజీ నిర్మాణం పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు జరిగే చోట అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని కోరారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పుడ్ కార్పొరేషన్ మెంబర్ భారతీ, మాజీ కార్పొరేటర్ నలువాల రవీందర్, ప్రభావతి, ఎస్‌ఈ నాగమల్లేశ్వర్‌రావు, ఈఈ మహేందర్, డీఈలు వెంకటేశ్వర్లు, ఏఈలు వాణీ, చైతణ్య, నిఖిత, డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News