Wednesday, November 6, 2024

శామీర్‌పేట నియోజకవర్గంలో సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ధ్యేయం

- Advertisement -
- Advertisement -
  • కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి

శామీర్‌పేట: నియోజకవర్గంలో సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి శామీర్ పేట మండలంలోని తుర్కపల్లి గ్రామంలో సుమారు రూ.6 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు (సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బస్సు స్టాప్, ఎస్సీ కమ్యూనిటీ హాల్, మార్కెట్ ) శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

అదే విధంగా మూడుచింతలపల్లి మండలంలోని పోతారాం, కొల్తూరు, ముడుచింతలపల్లి, లక్ష్మపూర్, ఉద్దేమర్రి, అద్రాస్ పల్లి, జగంగూడ గ్రామలలో సుమారు రూ.62.65 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు (సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్) పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందేలా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను తీర్చడమే తమ దయమని ఆ విధంగా ముందుకు సాగుతున్నమన్నారు. అదేవిధంగా లక్ష్మాపూర్ గ్రామంలోని శ్రీరామపాద క్షేత్రంలో ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి పాల్గొని పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపిలు ఎల్లు భాయ్, హారిక మురళి గౌడ్, జెడ్పిటిసి అనిత, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డిఈఈ వేణుగోపాల్, తాసిల్దార్ వాణి రెడ్డి, ఎంపిఒ మంగతాయారు, జడ్పీ కో అప్షన్ సభ్యులు జహీరుద్దిన్,వైస్ ఎంపిపి సుజాత, సర్పంచ్ లు కవిత వేణుగోపాల్ రెడ్డి, జామ్ రవి, హరి మోహన్ రెడ్డి, ఆంజనేయులు, విష్ణువర్ధన్ రెడ్డి, లలిత నరసింహ, అనురాధ రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల ఉప సర్పంచ్ లు, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News