Friday, November 22, 2024

గ్రామాభివృద్ధే ధ్యేయం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : గ్రామాభివృద్ధే ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం పోతన్‌పల్లి గ్రామంలో సుమారు రూ. 70 లక్షల విలువ కలిగిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు. మన ఊరు .. మన బడి పథకం కింద రూ. 31 లక్షలతో ని ర్మించిన ప్రాథమిక పాఠశాలను పప్రారంభించా రు.

రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న యా దవ కమ్యూనిటీ హాల్‌కు, రూ. 10 లక్షలతో నిర్మించనున్న కళ్యాణ మండపానికి, అదే విధంగా మరో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ముదిరా జ్ కమ్యూనిటీ హాల్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతం లో రూ. 200 పెన్షన్ తాము అధికారంలోకి వచ్చి న తర్వాత రూ. 2వవేలకు పెంచామని, మిషన్ భగీరథ కింద తాగునీరు ఇస్తున్నామని,

రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ , అంగన్‌వాడీ ద్వారా గుడ్లు, పౌష్టికాహారం ఇస్తున్నామని, కుల సంఘాలకు భవనాలు ఇచ్చామని, రూ. పది లక్షలు అయినా సరే ఖర్చు పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నామని, పక్కనే ఉన్న మన్యంకొండ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడి యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ఐటి పార్క్ , ఫుడ్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. పోతన్‌పల్లి గ్రామంలో గతంలో పెన్షన్ రూపేనా నెలకు కేవలం రూ. 60వేలు ఇచ్చేవారని, ఇప్పుడు ఆరు లక్షల 34వేల 416లు ఇస్తున్నామని, ఒక్క పెన్షన్ల కిందనే పోతన్‌పల్లిలో ఏడు కోట్ల 61 లక్ష 29వేలు ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, రైతుబంధు డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యు లు అల్లావుద్దీన్, దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News