Sunday, January 19, 2025

నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించడమే సర్కారు లక్షం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే అంజయ్యయాదవ్

షాద్‌నగర్: విద్యార్ధులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ వివరించారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం మహిళా గురుకులం, మొగిలిగిద్ద బాలికల బిసి గురుకులం, నాగులపల్లి మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్, గిరిజన మహిళా డిగ్రీ కళాశాల, కొందుర్గు ఎస్సీ బాలుర గురుకులం, చౌదర్‌గూడ బిసి బాలుర గురుకులం, కొత్తూరు గిరిజన బాలికల పాఠశాల, మొగిలిగిద్ద కస్తూర్బా, కొందుర్గు కస్తూర్భా, లాల్‌పహాడ్ కస్తూర్బా, పాటిగడ్డ కస్తూర్బా, కొత్తూరు కస్తూర్భా పాఠశాలల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సావాలను ఘనంగా నిర్వహించారు.

విద్యార్థులకు పుస్తకాలను, యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యాభివృద్ది కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని వివరించారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్యను అన్ని విధాల అభివృద్ధ్ది చూపాలనే ఉద్దేశంతోనే కార్పొరేట్ తరహాలో విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి క్రమ శిక్షణతో విద్యను నేర్చుకొని తమ ఉజ్వల భవిష్యత్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

షాద్‌నగర్ నియోజకవర్గంలోని 149 పాఠశాలల్లో రూ.22.2 కోట్లతో మన ఊరిమనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధ్ది చేసినట్లు వివరించారు. ప్రతి విద్యార్థికి కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలని లక్షంతో రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని అన్నారు. నాణ్యమైన విద్యతోపాటు సన్నబియ్యంతో కూడిన పౌష్టిక భోజనాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని అన్నారు.

అంతకుముందు లింగారెడ్డిగూడ గ్రామంలో గ్రామీణ గ్రంథాలయాన్ని చైర్మెన్ లక్ష్మీనర్సింహ్మారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ భీష్వ మాధవి రామకృష్ణల సమక్షంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పివైస్ చైర్మెన్ ఈట గణేష్, ఎంపిపి ఇద్రీస్, జడ్పిటిసి సభ్యుడు పి.వెంకట్‌రాంరెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ బక్కన్న యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ లక్ష్మీనర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మన్నె కవిత నారాయణ, ఎంఇఓ శంకర్ రాథోడ్‌లతోపాటు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News