Monday, December 23, 2024

మెరుగైన విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వ లక్షాన్ని నెరవేర్చాలి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా

మెదక్: మెరుగైన విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వ లక్షాన్ని నెరవేర్చాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ప్రజావాణి సమావేశ మందిరంలో పల్లె దవాఖాన,మన ఊరు- మన బడి సంబంధించిన పనులపై ఇంజనీరింగ్ అధికారులు,ఎంపిడిఓలతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి గ్రామంలో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్షాన్ని నెరవేర్చడానికి, పల్లె దవాఖానాల ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో ఆర్‌ఎంపి, పిఎంపి డాక్టర్స్ ప్రమేయం లేకుండా పల్లె దవాఖానలలో ఎంబిబిఎస్ డాక్టర్లతో పాటు అర్హత కలిగిన వైద్య సిబ్బందితో సేవలు అందుతాయని తెలిపారు. ప్రజాప్రతినిధుల సహకారాలు తీసుకొని పల్లె దవాఖానాలు ఏర్పాటు త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు.

అల్లాదుర్గం, రంగంపేట, వెల్దుర్తిలలో గల పిహెచ్‌సి రిపేరింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించడానికి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదని, మన ఊరు- మన బడికి సంబందించిన పనులు పూర్తైన వాటి వివరాలు సమర్పించాలని తెలిపారు. ఎక్కడైనా ఇంకా పనులు మొదలుపెట్టకపోతే సంబందిత అధికారులు దగ్గరుండి మార్కింగ్ వేసి పనులు ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాదికారి చందునాయక్, డిపిఓ సాయిబాబా, పంచాయతీ రాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి, డిఈఓ రాధాకిషన్, సంబంధిత శాఖ ఇంజనీర్లు, ఎంపిఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News