Monday, December 23, 2024

కాంగ్రెస్, కామ్రేడ్ల మధ్య పొత్తు ఖరారు..

- Advertisement -
- Advertisement -

ఆ నాలుగు సీట్లు లెఫ్ట్ పార్టీలకు!

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, కామ్రేడ్ల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లను లెఫ్ట్ పార్టీలకు కేటాయించింది. సిపిఐ, సిపిఎంలకు చెరో రెండు సీట్లను కేటాయించింది. సిపిఎంకు వైరా, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలు, సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లను ఖరారు చేసినట్టు తెలిసింది. కాగా, మునుగోడు, హుస్నాబాద్ స్థానాలను లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్ నిరాకరించినట్టు సమాచారం. కేటాయించిన ఈ నాలుగు సీట్లలో లెఫ్ట్ పార్టీలు ఏ అభ్యర్థులను బరిలోకి దింపనున్నారా? అనే ఆసక్తి నెలకొంది.

కమ్యూనిస్టు పార్టీలకు సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తి కావడంతో కాంగ్రెస్ ఇక రెండో జాబితాను విడుదల చేయడానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే మిగిలిన సీట్లలో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించనుంది. ఇదిలా ఉండగా, వామపక్షాలతో పొత్తు నష్టమేనని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టిక్కెట్లు రాని వారికి పదవులు వస్తాయన్నారు. టిక్కెట్లు రాలేదని నిరాశ చెందవద్దని కోరారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారడం బాధాకరమన్నారు .టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేయడం సరైంది కాదని చెప్పారు. రేవంత్ రెడ్డి ని తిడితే అధిష్టానాన్ని తిట్టినట్టేనని తేల్చి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News