Wednesday, January 22, 2025

గృహలక్ష్మీదరఖాస్తు గడువు పెంచాలి

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ రూరల్ : గృహలక్ష్మి పథకాని కి దరఖాస్తుల గ డువు పెంచాలని కా ంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి జూప ల్లి కృష్ణా రావు అన్నారు. బుధవారం కొల్లాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ గృహల క్ష్మి దరఖాస్తు గడువును నెల రోజులకు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మద్య ం షాపుల టెండర్లను మూడు నెలల ముందే 15 రోజుల వరకు గడువు వచ్చిన ప్రభుత్వం పేద ప్రజలకు ఉపయోగపడే గృహలక్ష్మి పథకానికి దర ఖాస్తులకు మాత్రం మూడు రోజులే గడువు ఇవ్వడం ప్రజలను మోసం చేయడమే నని అన్నారు. 9 సంవత్సరాల క్రితం ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల పది వేల రూ పాయలు ఇస్తామని ప్రకటించి నేడు మూడు లక్షలు ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నా రు. రానున్న శాసన సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, సిబ్బంది నరసింహ రావు, ఎస్‌ఎండి నాయిమ్ పాష, షేక్ రహీం పాష, మాచుపల్లి బాలస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ, మాజీ సర్పంచ్ మేకల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News