Wednesday, January 8, 2025

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

- Advertisement -
  • జిల్లా కలెక్టర్ శరత్
    సంగారెడ్డి: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్‌డిఓ అంబదాస్ దరఖాస్తులను స్వీకరించగా సమావేశం నుంచి బయటకు వచ్చి జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలోవచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి మొత్తం 39 ఆర్జీలు రాగా అందులో 12 రెవెన్యూ శాఖకు సంబంధించినవన్నారు. 27శాఖలకు సంబంధించిన ఆర్జీలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులున్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News