Wednesday, January 22, 2025

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -
  • అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

వికారాబాద్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 231 ఫిర్యాదులను అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్‌లతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ధరఖాస్తులను సం బంధిత అధికారులకు అందజేసి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News