Friday, January 10, 2025

ఆయిల్ పాం పంట సాగు విస్తీర్ణం పెంచాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలో ఆయిల్ పాం పంట సాగు విస్తీర్ణం వేగవంతంగా పెంచాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ అధికారులతో ఆయిల్ ఫామ్ పంట సాగుపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆయిల్ ఫామ్ పంట సాగు లక్షం 3400 ఎకరాలు కాగా ఇప్పటివరకు 1000 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారని, వర్షాలు కురుస్తున్నందున రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు సరఫరా చేసి పంట విస్తీర్ణం పెంచి వేగవంతంగా లక్షం పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News