నల్గొండ : జి.ఓ 58, 59 కింద అర్హులైనల బ్ధిదారుల స్థలాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి కోరారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహశీల్దార్ల తో నిర్వహించిన సమావేశంలో జి.ఓ. 58, 59 పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 31, 2023 వరకు జీవో 58 కింద వచ్చిన 4581 దరఖాస్తులు, జీవో 59 కింద వచ్చిన 6039 దరఖాస్తులు, మొత్తం కలిపి 10620 దరఖాస్తులను తహసీల్దార్‌లు ఆన్లైన్ మొబైల్ యాప్ ద్వారా లాగిన్ ఐ.డి. ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులు, అనర్హుల వివరాలను అప్‌లో నమోదు చేయాలని కోరారు.జి. ఓ 58 కింద దేవరకొండ రెవెన్యూ డివిజన్ సంబందించి 732 దరఖాస్తులు రాగా పి.ఏ.పల్లి 16, గుండ్లంపల్లి 1,గుర్రం పొడ్ 1,దేవరకొండ 461,చందంపేట 2, చింతపల్లి 28, కొండమల్లే పల్లి 216, నేరేడుగొమ్ము 1,నాంపల్లి 6, మర్రిగూడ నిల్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
మిర్యాలగూడ డివిజన్‌కు సంబంధించి 2103 దరఖాస్తులు రాగా తిరుమలగిరి సాగర్ 2,పెద్ద వూర 943,దామరచర్ల 23, త్రిపురారం14, అనుముల 128, నిడమానూరు 14, మిర్యాలగూడ 969, అడవి దేవులపల్లి 8, మాడుగులపల్లి నిల్, వేముల పల్లి 2 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. నల్గొండ రెవెన్యూ డివిజన్ కు సం బంధించి మొత్తం 1746 దరఖాస్తులు రాగా నకిరేకల్ 52, కేతెపల్లి నిల్, గట్టుప్పల్ నిల్, నల్గొండ 1436, చిట్యాల 47, కట్టంగూర్ 30, శాలిగౌరారం 2, తిప్పర్థి 5, కనగల్ 32, నార్కట్‌పల్లి 36, చండూర్ 16, మునుగొడ్ 90 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. జి. ఓ59 కింద దేవరకొండ రెవెన్యూ డివిజన్. సంబందించి మొత్తం 24 2 దరఖాస్తులు రాగా పి. ఏ.పల్లి 7, గుండ్లంపల్లి 2,గుర్రం పొడ్ నిల్, దేవరకొండ 45, చందం పేట3, చింత పల్లి18, కొండమల్లేపల్లి 127, నేరేడు గొమ్ము 1, నాంపల్లి 38, మర్రి గూడ 1 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
మిర్యాలగూడ డివిజన్‌కు సంబంధించి 4963 దరఖాస్తులు రాగా తిరుమలగిరి సాగర్ 4, పెద్దవూర 13 88,దామరచర్ల43, త్రిపురారం17, అనుముల45, నిడమానూరు21, మిర్యాలగూడ 3425, అడవి దేవుల పల్లి 8, మాడుగుల పల్లి 2, వేముల పల్లి 10 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. నల్గొండ రెవెన్యూ డివిజన్ కు సంబంధించి మొత్తం 834 దరఖాస్తులు రాగా నకిరేకల్ 36, కేతెపల్లి 2, గట్టుప్పల్ నిల్, నల్గొండ 521, చిట్యాల 76, కట్టంగూర్ 28, శాలిగౌరారం7, తిప్పర్తి 4, కనగల్ 28, నార్కట్ పల్లి 37, చండూర్ 12, మునుగొడ్ 83 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో గతంలో సాంఘిక సంక్షేమ శాఖచే భూసేకరణ జరిగి ఇండ్ల పట్టాలు ఇచ్చిన, ఇవ్వని ఖాళీ స్థలాలకు వెంటనే పట్టాలు జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవరకొండ ఆర్డిఓ గోపి రామ్ నాయక్, మిర్యాలగూడ,నల్గొండ(ఇంఛార్జి) ఆర్డిఓ చెన్నయ్య, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతి లాల్ తదితరులు పాల్గొన్నారు.