Thursday, January 23, 2025

సహాయకులే సోనాలి ఫోగట్ ను హత్య చేశారు

- Advertisement -
- Advertisement -

The assistants killed Sonali Phogat

సోదరుడు రింకు ఢాకా పోలీసులకు ఫిర్యాదు
పోలీస్ దర్యాప్తు సాగుతోంది : గోవా సిఎం సావంత్

పనజి : బీజేపీ నేత, నటి సోషల్ మీడియా సెలబ్రిటీ సోనాలి ఫోగట్ తన ఇద్దరు సహాయకుల ద్వారా హత్యకు గురయ్యారని సోనాలి సోదరుడు రింకు ఢాకా ఆరోపించారు. ఈమేరకు గోవా పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ ఫోగట్ మరణంపై రాష్ట్ర పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. డాక్టర్ల , గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) జస్పాల్ సింగ్ అభిప్రాయం మేరకు ప్రాథమికంగా ఆమె గుండెపోటుతో మరణించినట్టు కనిపించిందని చెప్పారు. అయితే ఫోగట్ సోదరుడు రింకు ఢాకా మాత్రం ఆమె హత్య కావింప బడ్డారని వాదించారు. మరణించడానికి ముందు తన సోదరి ఫోగట్ తన తల్లి, సోదరి, బావలతో మాట్లాడారని, ఈ సందర్భంగా తాను తన సహాయకుల నుంచి కలత చెందుతున్నానని, వారిపై ఫిర్యాదు చేసిందని రింకు ఢాకా తెలిపారు. హర్యానా లోని ఆమె ఫార్మ్‌హౌస్ నుంచి సిసిటివి కెమెరాలు, లాప్‌టాప్, ఇతర ముఖ్యమైన వస్తువులు ఆమె చనిపోయిన తరువాత అదృశ్యమయ్యాయని రింకు ఆరోపించారు.

ఉత్తర గోవా లోని అంజున వద్ద సెయింట్ ఆంథోనీ ఆస్పత్రిలో మంగళవారం ఫోగట్ చికిత్స పొందుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు మొదట గుండెపోటుతో ఆమె మృతి చెంది ఉండవచ్చని అనుమానం వెలిబుచ్చారు. మంగళవారం రాత్రి ఫోగట్ కుటుంబ సభ్యులు గోవాకు వచ్చారు. సహాయకులకు దూరంగా ఉండమని మర్నాడే హిస్సార్‌కు వచ్చేయమని తాము ఫోగట్‌కు తెలియచేశామని అంజున పోలీస్ స్టేషన్ బయట విలేఖరులకు ఢాకా చెప్పారు. ఆ ఇద్దరు సహాయకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు మొదట ఒప్పుకోలేదని, వారికి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుంటే పోస్ట్‌మార్టమ్ చేయనీయబోమని ఢాకా పేర్కొన్నారు. ఢిల్లీ లోని ఎయిమ్స్ లేదా జైపూర్ లోని ఎయిమ్స్‌లో పోస్టుమార్టమ్ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని తెలిపారు. గత 15 ఏళ్లుగా బీజేపీ నేతగా ఉంటున్న ఫోగట్ విషయంలో న్యాయం కోసం సహకరించాలని ప్రధాని మోడీని కూడా తాము అభ్యర్థిస్తామని చెప్పారు. అంతకు ముందు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జివ్‌బా దల్వీ ఈ సంఘటనపై మాట్లాడుతూ ఆగస్టు 22న ఫోగట్ గోవాకు వచ్చారని, అంజున ఏరియా హోటల్‌లో బస చేశారని, మంగళవారం రాత్రి 9 గంటలకు హోటల్ నుంచి ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లడమైందని తెలిపారు.

అసౌకర్యంగా ఉందని ఆమె చెప్పడంతో సెయింట్ ఆంథోనీ ఆస్పత్రికి తీసుకెళ్లామని డిజిపి మంగళవారం తెలిపారు. ఫొగట్ మరణానికి దారి తీసిన పరిస్థితులపై కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నా, హర్యానా లోని విపక్షాలు సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నా ఈ కేసులో దాచవలసిందేమీ లేదని డిజిపి స్పష్టం చేశారు. ఫొగట్ శరీరం పై ఎలాంటి గాయాలు లేవని, అయితే మరణానికి కారణం ఏమిటో పోస్టుమార్టమ్ నివేదిక చెబుతుందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News