Monday, December 23, 2024

అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : నూతన సమీకృత కలెక్టరేట్ పనులలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పనుల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్‌తో కలిసి పట్టణంలోని కుడకుడలో నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుందరికరణలో భాగంగా గ్రీనరి ఎక్కవగా ఉండాలని, ప్రారంభోత్సవ అనంతరం సభా ప్రా ంగణం స్థల పరిశీలన చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టరేట్‌లోని అన్ని గదులను శాఖల వారిగా జరుగుతున్న పనులను, చేయవలసిన ఏర్పాట్ల పై పలు సూచనలు చే శారు. చేపడుతున్న పనుల్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా అన్ని పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కాంపౌండ్ వాల్ రోడ్ల పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని త్వరలో సిఎం చేతుల మీదుగా ప్రారంభించుకునేలా సిద్ధం చేసి అందుబాటులో ఉంచాలని, ఎక్కడాకూడా పనులలో జాప్యం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి యస్‌సి నర్సింహ నాయక్, డిఆర్‌ఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, తహశీల్దార్ వెంకన్న, గుత్తేదారులు, జడ్పిటిసి జీడి భిక్షం, ఎంపిపి రవీందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్టా కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News