Sunday, December 22, 2024

అసాంఘిక కార్యకలాపాలను అధికారులు అరికట్టాలి

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర పట్టణంలో గత కొంత కాలంగా గంజాయిని విచ్చలవిడిగా వాడుతూ మత్తులో యువత జోగుతుందని కొందరు స్వార్ధపరులు ఆర్ధికంగా బలపడటానికి మధిర కేంద్రంగా చేసుకొని ఇటువంటి నీచకార్యక్రమాలకు పాల్పడుతున్నారని అటువంటి వారిపై మండల మరియు పోలీసు అధికారులు కఠినంగా చర్యలు చేపట్టాలని బెజవాడ రవి డిమాండ్ చేశారు. దీనితో పాటుగా మధిరలో ఇంకొక దరిద్రంతో యువత చెడిపోతున్నారని అందుకు నిదర్శనమే మధిర నడి బొడ్డు లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కూతవేటు దూరంలో నిత్యం రాద్దిగా వుండే కరెంటు బిల్లులు వసూలు కేంద్రం దగ్గరలో గిరిజన బాలుర వసతి గృహం పక్కనే ఎన్.ఎస్.పి ఆఫీస్ ప్రక్కన గతకొంత కాలంగా విచ్చలవిడి వ్యభిచారం జరుగుతున్నట్లుగా ఆ ప్రాంతానికి సంభందించిన ప్రజల విన్నపంతో ఆ ప్రాంతాన్ని వెళ్లి పరిశీలించగా కొన్ని వందల కండోమ్ లు ఆ ప్రాంతంలో ఉండటం చూస్తుంటే ఈ ప్రాంతంలో పగలు రేయి తేడా లేకుండా విచ్చలవిడిగా కొందరు మహిళలు, హిజ్రాలు ఈ సంఘటనలకు పాల్పడుతున్నారని అక్కడి కరెంటు బిల్లులు కట్టడానికి వచ్చిన వాళ్ళు, అక్కడ పని చేసే సిబ్బంది తమకు చెప్పారని బెజవాడ రవి అన్నారు.

ఇప్పటికైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగటానికి తావుకలిగించే పాడుబడిన కట్టడాలను ఎన్‌ఎస్‌పి, మున్సిపల్, పోలీస్ అధికారులు సమన్వయంతో పూర్తిగా తొలగించాలని అలాగే ఇటువంటి మరుగు ప్రదేశాలు మధిరలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టి చెడు వ్యసనాలకు యువత బలికాకుండా, చెడుమార్గాలు పట్టకుండా అధికారులు చొరవ చూపాలని దానికి సిపిఐ పూర్తిగా మద్దతు ఇస్తుందని బెజవాడ రవి తెలిపారు. వీటితోపాటుగా మధిర లో యువత మత్తుతో అనేక నేరాలకు పాల్పడుతున్నారని, పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయం జోరుగా సాగుతుందని గంజాయిని అమ్మే వారిపై పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకొని, గంజాయి కి మత్తు పదార్థాలకు బానిసలైన యువతకు కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టవలసిందిగా బెజవాడ రవి అధికారులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News