Friday, December 20, 2024

పర్లపల్లి గ్రామానికి అవార్డు జిల్లాకు గర్వకారణం

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్ : ఉత్తమ గ్రామపంచాయితీగా ఐఎస్‌ఓ 9001 సర్టిఫికేట్ , లిక్విడ్ ఆండ్ ప్లాస్టిక్ వేస్టెజ్ పచ్చదనం పరిశుభ్రత విభాగా ల్లో అవార్డు పొందిన తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామం మిగిలిన అన్ని గ్రామపంచాయితీలకు ఆదర్శంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామం ఐఎస్‌ఓ 9001 సర్టిఫికేట్ తో పాటు ప్లాస్టిక్ వేస్ట్ మరియు మేనేజ్మేంట్ లిక్విడ్ ఆండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ విభాగాల్లో , పరిశుభ్రత పచ్చదనం విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామంగా పర్లపల్లి నిలిచిందన్నారు.

రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయితిగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో జరిగిన ప ల్లెప్రగతి దినోత్సవంలో అవార్డును తీసుకోని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ గ్రామాన్ని మరిన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోని ఆదిశగా కృషిచేయాలని కోరారు.

ఈ సందర్బంగా గ్రామాన్ని పరిశుభ్రత, పచ్చదనంతో ఉండేలా కృషిచేసిన గ్రామ సర్పంచ్ మాదాడి భారతి నర్సింహారెడ్డి, యంపిపి కేతిరెడ్డి వనిత దేవేందర్, యంపిడిఓ రవీందర్ రెడ్డిలను కలెక్టర్ ప్రత్యేకం గా అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంపీపీ వనితా దేవేందర్ రెడ్డి,సర్పంచ్ మాదాడి భారతి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News