Thursday, December 26, 2024

నగరంపై త్వరగా అవగాహన పెంచుకోవాలి

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: కొత్తగా నియమితులైన వివిధ పోలీస్ స్టేషన్ల ఇన్స్‌స్పెక్టర్లు త్వరగా స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. నగరంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 163మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీసులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన అధికారులు కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలు చెప్పాలని కోరారు. నగరంలో శాంతిభద్రతలు అదుపులో ఉంచేందుకు సహకరించన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

నగర పోలీసింగ్‌పై అవగాహన పెంచుకోవాలని, మ రింత సేవలు అందించాలని అన్నారు. డిసిపిలు తమకు కావాల్సిన స్టాప్ గు రించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కోరారు. నగర పోలీస్ కమిషనరేట్‌ను 35 ఏళ్ల తర్వత పునర్ వ్యవస్థీకరించామని తెలిపారు. పోలీసులకు మూడు షిఫ్ట్‌ల్లో విధులు కేటాయించాలని, పోలీసుల ఆరోగ్యం కూడా తమకు ముఖ్యమేనని తెలిపారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ విక్రం సింగ్‌మాన్, జాయింట్ సిపి పర్మిళానూతన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News