బాల్కొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలో 18వ రోజు ‘హరితహారం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ భూస సునీతనరహరి, ఎంపిపి లావణ్య లింగాగౌడ్, ఎంపిడిఓ సంతోష్‌కుమార్, ఉప సర్పంచ్ షేక్‌వాహబ్, ఎంపిటిసి కన్న లింగవ్వపోశెట్టి, పంచాయతీ కార్యదర్శి రజినీకాంత్‌రెడ్డి, వార్డు సభ్యులతో కలిసి హాజరయ్యారు. బాల్కొండ మండల కేంద్రంలో ఫకీర్‌గుట్ట వద్ద అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఉపాధి హామీ కూలీలచే సుమారు 500 మొక్కలను నాటారు.
మొక్కలకు నీళ్లు పోసేందుకు ప్రత్యేకంగా బావి ఏర్పాటుచేసినట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ భవిష్యత్ తరాలకోసం దేశంలోఎక్కడా లేని విధంగా హరితహారం ద్వారా మొక్కలునాటే కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు పుప్పాల లావణ్యవిద్యాసాగర్, గాండ్ల రాజేష్, గాండ్ల రాజేందర్, బాద్గుణ రంజిత్ యాదవ్, ఆక్తరీబేగం, ఎపిఓ ఇందిరా, ఎపిఎం గంగాధర్, టిఎ రవీందర్, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, ఐకెపి సిసి విజయలక్ష్మీ, సిఎలు , ఎఫ్‌ఎ సురేష్, అంగన్‌వాడీ టీచర్లు , గ్రామస్తులు పాల్గొన్నారు.