Wednesday, January 22, 2025

రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

- Advertisement -
- Advertisement -

ముంబై: వరుసగా రెండో రోజు…నవంబర్ 10న కూడా దేశీయా స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. ఈ రోజు కొంత సేపయ్యాక కీలకమైన అమెరికా ద్రవ్యోల్బణం డేటా (inflation data) రానున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 419.85 పాయింట్లు లేక 0.69 శాతం తగ్గి 60613.70 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 128.80 పాయింట్లు లేక 0.71 శాతం తగ్గి 18028.20 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న మందకొడి వాతావరణం కారణంగా దేశీయ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆటో, పిఎస్‌యూ బ్యాంకుల్లో అమ్మకాల జోరు, ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది.
నిఫ్టీలో టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వీసెస్, ఎం అండ్ ఎం, టైటాన్ కంపెనీల షేర్లు నష్టపోగా, హిరో మోటార్ కార్పొరేషన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జిసి ప్రధానంగా లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ఫార్మా, మెటల్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసిజి రంగానికి చెందిన షేర్లు దాదాపు 0.5 శాతం నష్టపోయాయి. అరబిందో ఫార్మా, దీపక్ నైట్రేట్, రామ్‌కో సిమెంట్స్‌లో ‘షార్ట్ బిల్డప్’ కనిపించింది. కాగా లుపిన్, సమ్‌వర్ధన మదర్‌సన్ ఇంటర్నేషనల్, ఎస్‌కార్ట్‌లో ‘లాంగ్ బిల్డప్’ కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News