నోబిల్ గ్రహీత గణితభౌతిక శాస్త్రవేత్త రోజెర్ పెన్రోస్
కోల్‌కతా : ఇప్పుడున్న విశ్వాన్ని బిగ్‌బ్యాంగ్ ప్రారంభించలేదని, దీనికి ముందుగా మరోవిశ్వం ఉండేదని నోబిల్ గ్రహీత, గణితభౌతిక శాస్త్రవేత్త రోజెర్ పెన్రోస్ వెల్లడించారు. అతిప్రాచీన విశ్వంనాటి అవశేషాలు ఇప్పటి కృష్ణబిలాల్లో కనుగొనడమౌతోందని, ఆమేరకు విద్యుత్ అయస్కాంత వికిరణ ( ఎలెక్ట్రోమేగ్నటిక్ రేడియేషన్ ) ఆనవాళ్లు అంతరిక్షంలో కనిపిస్తున్నాయని వివరించారు. కోల్‌కతా లోని సహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ వర్చువల్ సదస్సులో ఆక్స్‌ఫర్డ్ నుంచి ఆయన మాట్లాడారు. వాస్తవానికి ఇప్పుడున్న విశ్వం కన్నా ముందు మరో విశ్వం ఉండేదని, ఆ విశ్వం అంతం తాలూకు చిహ్నమే బిగ్‌బ్యాంగ్ అని ఆయన వివరించారు. అదే విధంగా ఇప్పటి విశ్వం మరో కొన్ని కోట్ల సంవత్సరాల వరకు కొనసాగుతుంటుందని, ప్రస్తుత విశ్వం చిహ్నాలను కృష్ణబిలాల్లో విడిచిపెడుతుందని చెప్పారు. పెన్రోస్ ప్రస్తుతం ఆక్స్‌ఫర్ యూనివర్శిటీతో అనుసంధానంగా పనిచేస్తున్నారు.
బిగ్‌బ్యాంగ్ సిద్ధాంత కర్త స్టీఫెన్ హాకింగ్‌కు పెన్రోస్ సమకాలికులు. “కన్ఫర్మల్ సైక్లిక్ కాస్మోలజీ” అనే విశ్వసంబంధ సిద్ధాంతాన్ని ఆయన విశదీకరించారు. . విశ్వం, బిగ్‌బాంగ్ చుట్టూ పరిభ్రమించే అనంత వలయాలపై ఈ సిద్దాంతం సాగింది. కృష్ణబిలాలపై ఆయన చేసిన పరిశోధనలకు సంబంధించి భౌతిక శాస్త్రంలో 2020 లో నోబిల్ బహుమతి అందుకున్నారు. ఈనెల 9న ప్రారంభమైన ఈ సదస్సు మూడు రోజులపాటు సాగుతుంది. ఆక్స్‌ఫర్డ్ లోని థీరెటికల్ ఫిజిక్స్ , అండ్ కాస్మాలజీ సీనియర్ ప్రొఫెసర్ సుబీర్ సర్కార్, యూఎస్ ఫీల్డ్ క్వార్క్ గుయోన్ ప్లాస్మా (యుఎస్) ఫిజిస్టు లారీ మెక్‌లెర్రన్, ఐఐఎస్‌ఇఆర్ సంస్థాపక డైరెక్టర్ , మాజీ విశ్వభారతి వైస్‌ఛాన్సలర్ సుశాంత దత్తగుప్తా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఎఐసిఇ డిటెక్టర్ (సిఇఆర్‌ఎన్) అధినేత బికాష్ సిన్హా , ఆయన సహచర బృందం ఈ సదస్సులో మేక్రోకాస్మోస్, మైక్రోకాస్మోస్ పై నివేదిక సమర్పించారు. యాక్సిలిరేటర్, అండ్ ఫిలాసఫీ 2020 అనే ఈ సదస్సును టాగోర్ సెంటర్ ఫర్ నేచరల్ సైన్సెస్, అండ్ ఫిలాసఫీ , సహ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ నిర్వహించాయి.