Monday, December 23, 2024

‘ఆకాశ’ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఢీకొట్టిన పక్షి

- Advertisement -
- Advertisement -

The bird that hit the 'Akasha' Airlines plane

వెనక్కి తిరిగొచ్చిన విమానం

ముంబయి: బెంగళూరుకు వెళ్తున్న ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం క్యాబిన్‌లో కాలిన వాసన రావడంతో ముంబయికి తిరిగి వచ్చింది. అయితే పక్షి చనిపోవడం వల్లనే క్యాబిన్‌లో కాలిన వాసన వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముంబయి విమానాశ్రయంనుంచి బెంగళూరుకు బయలు దేరిన విమానాన్ని ఆకాశంలో పక్షి ఢీకొట్టింది. దీంతో వెంటనే పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించగా.. విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం ఇంజిన్‌లో పక్షి కాలిపోయిన ఆనవాళ్లు గుర్తించారు. విమానంలో దుర్వాసన వచ్చిందని, తిరిగి వచ్చిన తర్వాత ఇంజన్‌లో పక్షి కాలిపోయినట్లు గుర్తించామని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా ఈ సంఘటనపై ఎయిర్‌లైన్స్ ఇంకా స్పందించలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News