- Advertisement -
న్యూఢిల్లీ : క్రిప్టోకరెన్సీ మార్కెట్ సోమవారం అత్యధిక స్థాయిలో ట్రేడ్ అయింది. ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర మరోసారి వేగంగా పెరుగుతోంది. బిట్ కాయిన్ రేటు 42 వేల డాలర్లు దాటింది. ఈ ఏడాదిలో బిట్‌కాయిన్ ఇప్పటివరకు 9 శాతం తగ్గింది. అయితే ఇది 2021 నవంబర్ రికార్డు గరిష్ట ధర 69,000 డాలర్ల నుండి 39 శాతం పతనమైంది. కాయిన్ మార్కెట్‌క్యాప్ ప్రకారం, సోమవారం(ఫిబ్రవరి 7) మధ్యాహ్నం 12.20 గంటలకు బిట్‌కాయిన్ 3.11 శాతం లాభంతో 42,747 డాలర్ల వద్ద ట్రేడయింది. మొత్తం క్రిప్టో మార్కెట్ గత 24 గంటల్లో 3.29 శాతం పెరిగి 1.96 ట్రిలియన్లకు చేరుకుంది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథరియం కూడా 2.86 శాతం పెరిగింది.
- Advertisement -