Monday, December 23, 2024

కార్మిక హక్కులను కాలరాస్తోన్న బిజెపి ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -
కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోంది
సీఎల్పీ నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క

హైదరాబాద్: బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని, కార్మికుల అవసరాలను పట్టించుకోకుండా కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తోందని సీఎల్పీ నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం గాంధీ భవన్ ప్రకాశం హాల్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, ఏఐసిసి సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్, డాక్టర్ ఉదిత్ రాజు, కాంగ్రెస్ క్యాంపెన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, కేకేసి రాష్ట్ర చైర్మన్ సమీర్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం వేజెస్ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. సకల జనులు సమ్మె చేసి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ బోర్డుపై సమీక్ష చేయడం లేదని ఆయన ఆరోపించారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిధులను కార్మికుల కోసం ఖర్చు చేయకుండా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ చట్టాలు తెచ్చి పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. వీధి వ్యాపారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పాటు పడుతుందన్నారు.

2023-, 24 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు తీసుకువస్తామన్నారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాంగ్రెస్ ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని ఫ్యూడలిస్టుల ప్రభుత్వం, దేశంలోని క్యాపిటలిస్టుల ప్రభుత్వం చేసే కుటిల, కుట్రల్లో కార్మికులు పడొద్దని ఆయన సూచించారు. శ్రమ దోపిడీ లేకుండా ఎనిమిది గంటల పనివిధానం, మహిళలకు ప్రసూతి సెలవులు, అనేక కార్మిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి కార్మికులకు హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News