Tuesday, January 7, 2025

డేంజరస్ విలన్.. ‘మిరాయ్’ నుంచి మంచు మనోజ్ పవర్ ఫుల్ గ్లింప్స్

- Advertisement -
- Advertisement -

మంచు మనోజ్ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మిరామ్ మేకర్స్. సోమవారం మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా మిరాయ్ సినిమాలో మనోజ్ కు సంబంధించిన వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో ఇప్పటివరకు చూడని గెటప్ లో మనోజ్ పవర్ ఫుల్ గా స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ది బ్లాక్ స్వార్డ్ గ్లింప్స్ పేరుతో విడులైన ఈ వీడియా ఆకట్టుకుంటోంది.

యంగ్ హీరో తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డేంజరస్ విలన్ గా మనోజ్ నటిస్తున్నాడు. ఈ మూవీనిక సంబంధించిన నటీనటుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం మిరాయ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న మిరాయ్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News