Wednesday, April 9, 2025

లక్నో-వారణాసి హైవేపై బిఎండబ్ల్యూ కారులో చెలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

BMW Car got fire
సుల్తాన్‌పూర్: లక్నో-వారణాసి హైవేపై కదులుతున్న బిఎండబ్ల్యూ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ ప్రాణాలను కాపాడుకునేందుకు అందులో నుంచి దూకాల్సి వచ్చిందని పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొంత మంది స్థానికులు రోడ్డుపై బారికేడ్లు వేసి కాలిపోతున్న కారు గురించి ఇతర వాహనాలకు సిగ్నల్ ఇచ్చారు. కాగా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శకటాలను పిలిచినట్లు పోలీసులు తెలిపారు.
కారును నడిపిన  మహ్మద్ ఇమ్రాన్  తన కారును  సర్వీసింగ్ చేయించడానికి శనివారం ఉదయం లక్నోకు తెచ్చానని, సర్వీసింగ్ చేయించుకున్నాక వారణాసికి తిరిగి వస్తుండగా ఇలా జరిగిందని వివరించాడు. అకస్మాత్తుగా కారు ఇంజిన్ లాక్ అయింది,  అతనికి ఏమీ అర్థం కాకముందే, కారు నుండి పొగ రావడం మొదలయింది,  మంటలు చెలరేగాయి. పోలీసుల కథనం ప్రకారం ముహమ్మద్ ఇమ్రాన్ ఘాజీపూర్ నివాసి. పోలీసు శిక్షణ పాఠశాల సమీపంలో ఈ ఘటన జరిగినట్లు బంధువా కళా స్టేషన్‌ ఎస్‌ఓ రవీంద్ర సింగ్‌ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News