- Advertisement -
కేశంపేట: మండల పరిధిలోని సంతపూర్ గ్రామ శివారులో చెట్టుకు ఊరి వేసుకొని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కేశంపేట ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు. సంతపూర్ గ్రామం నుండి రావిచేడ్ వెళ్లే రహదారిలోని ఒక వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం లభించినట్లు తెలిపారు. సంఘటన జరిగి 4,5 రోజులు కావచ్చని, మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిందని తెలిపారు. మృతుడి 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండొచ్చునన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గ్రామ విఆర్‌ఎ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
- Advertisement -