Tuesday, January 21, 2025

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూల్ గ్రామ చెరువు గట్టు వద్ద గుర్తు తెలియని, కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైందని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్సై తెలిపిన వివరాల మేరకు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో నాగనూలు చెరువు ఒడ్డున గుర్తు తెలియని, కుళ్లిపోయిన ఒక మహిళ మృతదేహం ఉందని మున్సిపాలిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడం జరిగిందన్నారు.

ఇదిలా ఉండగా మృతదేహం ఎడమ చేతికి రెండు నీలం రంగు మట్టి గాజులు ఉన్నాయని, గోధుమ రంగు పంజాబి డ్రెస్ ఉందని, మృతురాలి వయస్సు దాదాపు 20 సంవత్సరాలు పై బడి ఉండవచ్చని తెలిపారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రి మార్చురీ గదికి మార్చడం జరిగిందని తెలిపారు. పోలీసుల విచారణలో ఎలాంటి వివరాలు లభించలేదు. కావున మహిళను గుర్తిస్తే 8712657712, 8712657711 నెంబర్లకు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని వారు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News