Sunday, January 19, 2025

చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

మియాపూర్ : గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేట్ చెరువులో మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికుల సమచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని బయటకి తీసి పరిశీలించగా ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నా రు. మృతి చెందిన మహిళకు 30 నుండి 35 మద్య వయస్సు ఉంటుందని తెలిపారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హస్పిటల్‌కు తరలిం చి కేసు దర్యాపు చేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News