Sunday, December 22, 2024

స్వగ్రామానికి చేరుకున్న ఆర్మీ జవాన్ మృతదేహం

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: జమ్మూ కాశ్మీర్‌లో గురువారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా వాసి ఆర్మీ జవాన్ పబ్బల్ల అనిల్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని అధికారులు స్వగ్రామానికి తీసుకు వచ్చారు. అనిల్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. గ్రామస్తులంతా జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. అమరుడా జోహార్లు అంటూ వారు నినాదాలు చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

సిరిసిల్ల జిల్లా బోయినిపెల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన పబ్బల్ల అనిల్ హెలికాప్టర్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. పది సంవత్సరాలుగా ఆర్మీలో పని చేస్తున్న అనిల్ ఇటీవలే 45 రోజులు సెలవుపై స్వగ్రామం వచ్చి సుమారు పది రోజుల క్రితం తిరిగి ఆర్మీ విధుల్లో చేరినట్లు సమాచారం. గురువారం హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో అనిల్ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. మృతునికి భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనిల్ మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. జమ్మూ కశ్మీర్‌లోని కిస్టువార్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News