Monday, January 6, 2025

దైవదర్శనానికి వెళ్ళి బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

చండ్రుగొండ : మండల పరిధిలోని శ్రీనగర్‌కాలనీ (దళితవాడ)కు చెందిన బాలుడు ఎన్‌టిఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మతల్లి దేవత దర్శననికి వెళ్ళి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం శ్రీనగర్ కాలనీకి చెందిన పెంబుల లక్ష్మినారయణ, కుమారి దంపతుల ఇద్దరికుమారులు తరణ్‌తేజ్, రణదేవ్ రేపల్లెవాడలో ఉండే అమ్మమ్మ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం తెల్లవారుజామున ప్రయణమై పెనుగంచిప్రోలు వెళ్ళారు.

దైవ దర్శనం కోసం అక్కడ ప్రవహించే మున్నేరువాగులో స్నానలకు దిగగా రణదేవ్ (14) స్నానం చేస్తూనే లోతు ఉన్న ప్రాంతంలో ఊబిలో ఇరుకుపోయాడు. కుటుంబసభ్యులు గమనించి బయటకు తీసేలోపే మృతి చెందా డు. రణదేవ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. దైవదర్శనానికి వెళ్ళి బాలుడు శవమై రావడంతో దళితవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News