Monday, December 23, 2024

సెల్లార్ పూడికతీసిన బిల్డర్‌పై తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలోని స్రావ్వ, స్వాతిక అపార్ట్‌మెంట్, ఆపిల్ అపార్ట్‌మెంట్ ను అనుకోని చేపట్టిన భారీ బహుళ అంతస్తుల సెల్లార్ నిర్మాణం వలన ప్రహరీ గోడ కూలిపోగా విషయం తెలిసిన వెంటనే డివిజన్ కా ర్పొరేటర్ గంగాధర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి హుటాహుటిన అర్ధరాత్రి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, అపార్ట్‌మెంట్ వాసులకు భరోసా కలిపించి సహాయక చర్యలో పాల్గోన్న ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సెల్లార్ పూడికతీత వలన అపార్ట్‌మెంట్ వాసులకు తీవ్ర ఇబ్బం దులు ఎదురుకుంటూన్నరన్నారు. సెల్లార్ తీసిన బిల్డర్ తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విధాలుగా చర్యలు తీసుకోని బారికేడ్లు, ఇసుక బస్తాలు వేసి త్వరితగిన పనులు పూర్తి చేయాలని ప్రజలకు అపార్ట్‌మెంట్ వాసులకు ఎ టువంటి ఇబ్బంది లేకుండా చేయాలని బిల్డర్‌కి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెటుకొని అన్ని రక్షణ చర్యలు, బారి కేడ్లు చేపట్టాలన్నారు. కాలనీ వాసులు ధైర్యంగా ఉండలని, అధైర్యనడకూడదని మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. చిన్న పిల్లలు, పెద్దలు, కాలనీ వాసులు అటువైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కా ర్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News