కుత్బుల్లాపూర్: మేడ్చల్ ట్రాఫిక్ జోన్ కార్యాలయాన్ని అధికారులు ఆదివారం కూల్చివేత పనులు ప్రారంభించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలో ఉన్న ఎన్సీఎల్ ఎస్‌క్లేవ్ డిమార్టు సమీపంలో ఇటీవల కాలంలో ఈ కార్యాలయాన్ని దాదాపుగా కోటి రూపాయాలతో ఈ కార్యాలయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేశారు. జూన్ ఐదవ తేదీన మంత్రి మల్లారెడ్డి, ఎంఎల్‌ఎ కెపి వివేకానంద్, మేడ్చల్ డిసిపిలు సందీప్, ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావులు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ప్రారంభించి నెలరోజులు కూడా కాకముందే ఈ కా ర్యాలయాన్ని కూల్చివేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే నూతన కార్యాలయాన్ని ఎందుకు కూల్చివేశారని ఆరా తీస్తే స దరు స్థలం హెచ్‌ఎండిఎ పరిధిలోకి వస్తుందని అది కూడా రోడ్డు ప్రదేశం ఉండటంతో హెచ్‌ఎండిఎ అధికారులు అభ్యంతరం తెలుపటంతో పోలీసు అధికారులు స్వచ్ఛందంగా కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఇటీవల ఈ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహించారు. ఆ తరువాత కార్యాలయాన్ని కూల్చివేయటం గమనార్హం.