Saturday, November 16, 2024

పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారం… చిన్నపాటి పొదపు చర్యలతో మాయం

- Advertisement -
- Advertisement -

విద్యుత్ రంగ నిపుణులు

మన తెలంగాణ / హైదరాబాద్:  ఒక వైపు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే వాటితో పాటే విద్యుత్ బిల్లులు కూడా పెరుగుతున్నాయి. గతంలో కంటే బిన్నంగా ఈ సంవత్సరం విద్యుత్ చార్జీలను పెంచడంతో వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. వినియోగదారులు విద్యుత్ భారం నుంచి తగ్గించుకునేందుకు చిన్న చిన్న పోదుపు చర్యలు పాటిస్తే చాలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో సాధారణంగా గృహాల్లో ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు ,ఎయిర్‌కూలర్ వంటి గృహోపకరణాల వినియోగం పెరుగుతుంది. దీంతో పాటు విద్యుత్ బిల్లులు కూడా పెరిగిపోతాయి. ఇది సామాన్య వినియోగదారులకు అదనపు భారంగా మారుతుంది. ఏసీలు అధిక మొత్తంలో విద్యుత్‌ను ఉపయోగించుకుంటుంది. దాంతో బిల్లు కూడా అదే విధంగా వస్తుంది. వేసవిలో వచ్చే బిల్లుల నుంచి తప్పించుకోవాలంటే చిన్న చిన్నజాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

ముఖ్యంగా ఏసీని 16 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాకుండా 24 డిగ్రీల ఉష్ణోగ్రత వద్దపెట్టడం ద్వారా వినియోగదారులకు కావాల్సిన చల్లదనంతో పాటు బిల్లు కూడా తగ్గుతుంది. అదే విధంగా సాధారణంగా గృహల్లో అనేక రకాల బల్బులను వినియోగించడం జరుగుతుంది.వాటి స్థానంలో అతి తక్కువ విద్యుత్‌ను తీసుకుని ఎక్కువ వెలుగును ఇచ్చే ఎల్‌ఈడి బల్పులను వినియోగించాలని చెబుతున్నారు. టీవిని వినియోగించేవారు అధిక సంఖ్యలో దాన్ని రిమోట్ ద్వారా మాత్రమే ఆఫ్ చేస్తుంటారని అలా చేయడం ద్వారా విద్యుత్ వినియోగం అధికమవుతుందని చెబుతున్నారు. ఇళ్ళల్లో ఉండే టీవీలను కేవలం రిమోట్ ద్వారానే కాకుండా సంబంధిత స్విచ్‌ను ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా ఏసీ యూనిట్‌ను నీడలో ఉంచుకునే చూడాలని చెబుతున్నారు. ఔట్ డోర్ యూనిట్‌ను నేరుగా సూర్యకాంతి పడే ప్రాంతంలో ఉండటం ద్వారా విద్యుత్ వినియోగం అధికం అవుతుందని చెబుతున్నారు. ఆటోమెటిక్ పవర్ ఆఫ్ ఐరన్ బాక్స్‌ను కోనుగోలు చేయడం ద్వారా విద్యుత్ బిల్లులో ఆదా చేయవచ్చని చెబుతున్నారు.అంతే కాకుండా బాగా పొడిగా ఉన్న దుస్తులను ఐరన్ చేయడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుందని, తద్వారా బిల్లు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్‌ను గాలి తగిలే ప్రాంతంలో ఉండేలా చూడాలని దీంతో ఫ్రిజ్ విద్యుత్‌ను తక్కువగా తీసుకుంటుందన్నారు. ఫ్రిజ్‌ను సాధారణంగా గాలి వెలుతురు అధికంగా వచ్చే ప్రాంతంలో పెట్టడం ద్వారా విద్యుత్ వినయోగం కూడా తక్కువగా తీసుకుంటుందన్నారు. ప్రస్తుత రోజుల్లో మోబైల్ వినియోగం చేయని వారు ఎవరూ లేరని కొన్ని ఇళ్ళల్లో కుటుంబ సభ్యులకంటే మోబైల్ పోన్లు ఎక్కువగా ఉన్నాయని,సాదారణంగా వినియోగదారులు మోబైల్ చార్జీంగ్ చేసుకున్న అనంతరం వాటికి సంబందించిన ఫిన్ అదే విధంగా వదిలేయడం వంటి చర్యలతో కూడా విద్యుత్ వినియోగం అవుతుందని చెబుతున్నారు. చార్జింగ్ చేసుకున్న వెంటనే సంబందిత స్విచ్‌లను వెంటనే ఆఫ్ చేయడం ద్వారా విద్యుత్‌ను ఆదాచేయడమే కాకుండా విద్యుత్ బిల్లు భారం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News